Page Loader
Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు
స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు

Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 03, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని, కాకినాడ పోర్టు భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించాల్సిందేనని మంత్రులు స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు భద్రతలో భాగంగా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌ఓ)ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్‌ బియ్యం రవాణా చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకు సంబంధించి అధికారుల చర్చ కొనసాగుతోంది.

Details

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రస్తుతం కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ కేంద్రంగా మారిన పరిస్థితి చర్చనీయాంశమైంది. రేషన్‌ బియ్యాన్ని పాలిష్ చేసి సిల్కీ రైస్‌గా మార్చేందుకు సార్టెక్స్‌ యంత్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. పోర్టు గోదాముల్లో యంత్రాలు ఏర్పాటు చేసి మిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న విషయం ఐదు నెలల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో బయటపడిన విషయం తెలిసిందే. సార్టెక్స్ యంత్రాల వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారుల్ని హెచ్చరించారు.