NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CISF: 'సీఐఎస్‌ఎఫ్‌'లో మొదటి పూర్తిస్థాయి మహిళా రిజర్వ్ బెటాలియన్‌  
    తదుపరి వార్తా కథనం
    CISF: 'సీఐఎస్‌ఎఫ్‌'లో మొదటి పూర్తిస్థాయి మహిళా రిజర్వ్ బెటాలియన్‌  
    'సీఐఎస్‌ఎఫ్‌'లో మొదటి పూర్తిస్థాయి మహిళా రిజర్వ్ బెటాలియన్‌

    CISF: 'సీఐఎస్‌ఎఫ్‌'లో మొదటి పూర్తిస్థాయి మహిళా రిజర్వ్ బెటాలియన్‌  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 12, 2024
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో తొలిసారి పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్‌ను మంజూరు చేసింది.

    విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా విధులు పెరుగుతున్న నేపథ్యంలో, సుమారు 1000మందికి పైగా మహిళా సిబ్బందితో కూడిన సీఐఎస్‌ఎఫ్‌ రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.

    ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు.

    ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌లో 12 రిజర్వ్ బెటాలియన్లు ఉన్నాయి. సీఐఎస్‌ఎఫ్‌లోని మహిళా రిజర్వ్ దళాలు సివిల్ విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో, తాజ్ మహల్, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాలలో భద్రతా కర్తవ్యాలు నిర్వహిస్తున్నాయి.

    వివరాలు 

    సీఐఎస్‌ఎఫ్‌ కేంద్ర హోంశాఖ పరిధిలోని ఒక కేంద్ర సాయుధ పోలీసు దళం

    దాదాపు 1.70 లక్షల మంది సిబ్బందితో కూడిన సీఐఎస్‌ఎఫ్‌ కేంద్ర హోంశాఖ పరిధిలోని ఒక కేంద్ర సాయుధ పోలీసు దళం.

    ఇది దేశ రాజధాని దిల్లీలోని వివిధ కేంద్ర సంస్థల భవనాలు, పౌర విమానాశ్రయాలు, అణుశక్తి కేంద్రాలు, ఏరోస్పేస్ కేంద్రాలతో పాటు పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయాలు, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ వంటి ప్రైవేట్ సంస్థలకు కూడా భద్రతా సేవలు అందిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర హోంశాఖ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కేంద్ర హోంశాఖ

    పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..? పోలీస్ మెడల్స్
    మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం మణిపూర్
    French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు ఫ్రాన్స్
    75th Republic Day: 1132 మంది సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025