Bhatti Vikramarka: తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ వార్తాకథనం ఏంటి
ఐఐటీలు కేవలం విద్యా సంస్థలుగా మాత్రమే కాకుండా, దేశ నిర్మాణానికి కీలక వేదికలుగా కూడా పనిచేస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఐఐటీ హైదరాబాదులో ఇప్పటి వరకు 11,500 పరిశోధనల ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు, స్టార్టప్‌ల ద్వారా రూ.1500 కోట్ల ఆదాయం సాధించడం ఒక గొప్ప పరివర్తనగా ఆయన అభిప్రాయపడ్డారు.
ఐఐటీ కందిలో నిర్వహించిన హైదరాబాద్-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు.
ఇక్కడ ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు ఐఐటీ హైదరాబాద్ చిరునామాగా మారిందని, ఈ సంస్థ కలల కర్మాగారమని పేర్కొన్నారు.
వివరాలు
ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే..
ఈ ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్, మోనాష్ యూనివర్సిటీ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు, తెలంగాణ, భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా కీలకమైనవి అని భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ రూపొందించడంలో ఈ వర్క్ షాప్ సహకారం అనివార్యంగా అవసరమవుతుందని చెప్పారు.
పండిట్ నెహ్రూ ఐఐటీలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా అభివర్ణించారని, సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా పేదరికం, అసమానతలపై పోరాటం చేయడానికి వీటి అవసరాన్ని గుర్తించారని వివరించారు.
వివరాలు
ఐఐటీ హైదరాబాదు అభివృద్ధికి వైయస్ రాజశేఖర్ రెడ్డి పునాది
ఐఐటీ హైదరాబాదు అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషించిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఈ సంస్థ పునాది వేసినట్లు చెప్పారు.
ఆయన నేతృత్వంలో ఐఐటీ హైదరాబాదు మొదలుపెట్టడం, తెలంగాణలో ఖనిజాల అన్వేషణ, మైనింగ్ పద్ధతుల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి ముందడుగు వేయించడం అవసరం అని తెలిపారు.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీకి సంబంధించి ప్రభుత్వానికి పరిశోధనతో కూడిన చర్యలు ప్రాధాన్యం ఇవ్వడం, ఈ ఖనిజాలు హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు వంటి వాటి నిర్మాణానికి ఈ ఖనిజాలు అవసరమవుతాయన్నారు.
వివరాలు
2030 నాటికి 2వేల మెగావాట్ల పెట్టుబడులే లక్ష్యం
2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ భవిష్యత్తులో ఇంధనంగా భావిస్తున్నామని, ఆవిష్కరణల ప్రోత్సాహానికి, సుస్థిరతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
ఈ ఆలోచనలు పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడంలో కీలకంగా నిలుస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.