LOADING...
Hyderbad: సికింద్రాబాద్‌-శామీర్‌పేట్‌ రెండో ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్
సికింద్రాబాద్‌-శామీర్‌పేట్‌ రెండో ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్

Hyderbad: సికింద్రాబాద్‌-శామీర్‌పేట్‌ రెండో ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ అవుటర్‌ రింగ్‌రోడ్‌ వరకు ప్రతిపాదించిన రెండో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ఉన్నఅవరోధాలు దాదాపుగా తొలగిపోయాయి. ఈప్రాజెక్టులో ప్రధానంగా సమస్యగా నిలిచిన రక్షణ శాఖకు చెందిన భూముల అప్పగింత కొలిక్కి వచ్చింది. ఫలితంగా ఈనెలాఖరులోగానీ లేదా అక్టోబర్‌ తొలి వారంలోగానీ టెండర్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని ఒక కీలక అధికారి వెల్లడించారు. ఇకపోతే,ప్యారడైజ్‌ ప్రాంతం నుంచి రెండు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో డెయిరీఫాం కారిడార్‌ పనులకు సంబంధించి హెచ్‌ఎండీఏ ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల భాగంగా జవహర్‌నగర్‌లోని 300ఎకరాల భూసంపదను హెచ్‌ఎండీఏ రక్షణ శాఖకు అప్పగించింది. దీంతో రెండు ప్రాజెక్టులకు లైన్‌క్లియర్‌ అయింది.

వివరాలు 

ఎలివేటెడ్‌ కారిడార్‌-1.. 

ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఇంటర్‌ఛేంజ్‌ దూరం: 18.10 కిలోమీటర్లు అవసరమైన భూమి: 197 ఎకరాలు రక్షణ శాఖ భూములు: 113.48 ఎకరాలు భూ పరిహారంతో కలిపి ప్రాజెక్టు వ్యయం: రూ.3,619 కోట్లు ఎలివేటెడ్‌ కారిడార్‌- 2.. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫాం వరకు దూరం: 5.4 కిలోమీటర్లు ప్రాజెక్టు వ్యయం: రూ.1,550 కోట్లు