Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్‌కు గ్రీన్‌సిగ్నల్.. ఛార్జీలు ఖరారు, RACకు నో ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఎంతో కాలంగా ప్రయాణికులు ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు ఇక పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో, దీర్ఘదూర ప్రయాణాలకు అనువుగా రూపొందించిన ఈ రైలు త్వరలోనే కోల్‌కతా-గువాహటి మధ్య పరుగులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన టికెట్ ఛార్జీలు, బుకింగ్ నిబంధనలు, ప్రత్యేక ఫీచర్లు వంటి పూర్తి వివరాలను రైల్వే శాఖ నోటిఫై చేసింది.
Details
ఛార్జీల వివరాలు
ఈ రైలులో కనీస టికెట్ ధర రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 400 కిలోమీటర్ల ప్రయాణానికి 3ఏసీకి వర్తించే కనీస ఛార్జీ. అంటే ప్రయాణ దూరం తక్కువగా ఉన్నా ఈ మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 3,500 కిలోమీటర్ల ప్రయాణానికి 1ఏసీ ఛార్జీ రూ.13,300గా నిర్ణయించారు. కిలోమీటర్ వారీగా కనీస టికెట్ ధరలు ఇలా ఉన్నాయి 3ఏసీ : కిలోమీటర్‌కు రూ.2.4 (కనీసం రూ.960) 2ఏసీ : కిలోమీటర్‌కు రూ.3.1 (కనీసం రూ.1,240) 1ఏసీ : కిలోమీటర్‌కు రూ.3.8 (కనీసం రూ.1,520) ప్రయాణ దూరం పెరిగే కొద్దీ టికెట్ ధరలు కూడా అనుగుణంగా పెరుగుతాయి.
Details
నో RAC విధానం
వందే భారత్ స్లీపర్ రైలులో కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్లు ఉన్నవారికే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఇందులో RAC లేదా వెయిటింగ్ లిస్ట్ అనే సౌకర్యం లేదు. పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్లతో కూడా ప్రయాణం చేయలేరు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (60 రోజుల ముందునుంచి) నుంచే అన్ని బెర్తులు బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయి.
Details
బుకింగ్ నిబంధనలు
ఈ రైలులో మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే కోటా ఉంటుంది. ఇతర ప్రత్యేక కోటాలకు అవకాశం లేదు. టికెట్లు డిజిటల్ విధానంలోనే బుక్ చేయాల్సి ఉంటుంది. టికెట్ క్యాన్సిల్ చేసినపుడు 24 గంటల్లో రిఫండ్ అందేలా వ్యవస్థను రూపొందించారు. 45 ఏళ్లు పైబడిన మహిళలు, 60 ఏళ్లు దాటిన పురుషులకు సీట్ల లభ్యతను బట్టి లోయర్ బెర్తులను సిస్టమ్ స్వయంచాలకంగా కేటాయిస్తుంది
Details
వందే భారత్ స్లీపర్ ప్రత్యేక ఫీచర్లు
పూర్తిగా ఎయిర్ కండీషన్‌తో కూడిన 3ఏసీ, 2ఏసీ, 1ఏసీ బోగీలు గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ (ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి గంటకు 130 కిమీ వేగంతో నడిపే అవకాశం) ఆటోమేటిక్ స్లయిడింగ్ డోర్స్ అధునాతన టాయిలెట్లు, రీడింగ్ లైట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు సీసీటీవీ కెమెరాలు, ప్రమాద నివారణకు ఆధునిక భద్రతా వ్యవస్థలు ఈ అన్ని సదుపాయాలతో వందే భారత్ స్లీపర్ రైలు, దేశంలో దీర్ఘదూర రైలు ప్రయాణాల అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లనుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.