Page Loader
Group-1: గ్రూప్-1 ప‌రీక్ష‌పై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను  కొట్టేసిన  తెలంగాణ హైకోర్టు
గ్రూప్-1 ప‌రీక్ష‌పై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Group-1: గ్రూప్-1 ప‌రీక్ష‌పై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను  కొట్టేసిన  తెలంగాణ హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. అభ్యర్థులు రిజర్వేషన్లు సహా పలు అంశాలపై కోర్టును ఆశ్రయించి, రిజర్వేషన్లు తేలే వరకు గ్రూప్-1 ఫలితాలు ప్రకటించవద్దని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఫలితాలను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే, ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు, ఫలితాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో, టీజీపీఎస్సీ అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. అలాగే, వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్-1 ఫలితాలను ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇటీవల వెల్లడించారు.