గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దసరా తర్వాత జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పబ్లిక్ కమిషన్(TSPSC) గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్‌సీ వెలువరించేందుకు సిద్ధమైంది.
దసరా తర్వాత జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో 8,180పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ జులై 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ పరీక్షకు 7.6లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో పేపర్-1లో ఏడు, పేపర్-2లో మూడు ప్రశ్నలను తొలగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.
ఇప్పటికే నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఫైనల్ కీని టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది.
ఈ క్రమంలో మూల్యాంకనం పూర్తి కాగా.. ఎలాంటి పొరపాట్లు చేయకుండా జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను విడుదల చేయాలని కమిషన్ యోచిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
7.6లక్షల మంది పరీక్షకు హాజరు
TS Group-4: దసరా తరువాత గ్రూప్-4 మెరిట్ జాబితా #telangana #group4 #tspsc * ఎన్నికల కోడ్ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక https://t.co/lEf2cICnri pic.twitter.com/rrr0yRMA7e
— Eenadu Pratibha (@eenadupratibha) October 17, 2023