తదుపరి వార్తా కథనం

National Anthem: జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 11, 2024
10:04 am
ఈ వార్తాకథనం ఏంటి
మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ అరుదైన ఘనతను సాధించాడు.
ఒడిశాలో 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి 'లార్జెస్ట్ సింగింగ్ లెసన్' పేరిట జాతీయ గీతం జగగణమన గానంతో గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు.
గతేడాది లండన్‌లో సంఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి జనగణమన గానం ద్వారా ఆయన గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
గత నెల చిత్రీకరించిన ఈ రికార్డింగును ఆగస్టు 14న అన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామన్నారు.
Details
జాతీయ గీతం గానంతో సరికొత్త రికార్డు
ఈ సారి ఒడిశాకు చెందిన గిరిజన విద్యార్థులతో కలిసి సరికొత్త రికార్డును స్థాపిస్తామన్నారు.
వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, రాకేష్, వీణ మాస్ట్రో జయంతి వంటి పలు సంగీత దిగ్గజాల ప్రదర్శనను ఇందులో చూడొచ్చు.
ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు ఈ రికార్డును రిలీజ్ చేస్తామన్నారు.