Page Loader
హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్
హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్

హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 28, 2023
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ లో మరోసారి ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఐఎస్ కేపీ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీ పరిధిలోని టోలీచౌకికి చెందిన ఫసీ సహా ఆయన కుమార్తెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గుజరాత్ లోని సూరత్ నగరానికి చెందిన సుబేరా బాను, శ్రీనగర్ కు చెందిన నాజిర్, హయత్, అజీమ్ లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డట్టు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకే ఈ గ్రూప్ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ముఠాను లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.

DETAILS

పెద్దపల్లి జిల్లాలో తండ్రి కూతురు అరెస్ట్

ఐఎస్‌కేపీ ఉగ్రవాద కేసును గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు బుధవారం అమీర్‌పేట్ లోని ఓ సాఫ్ట్ వేర్ కోచింగ్‌ సెంటర్లలో సోదాలు జరిపింది. అయితే అంతకు ముందు రోజే 18 ఏళ్ల యువకుడితో పాటు మరో నలుగురిని విచారించింది.అనంతరం ఇవాళ సోదాలు చేపట్టింది. మంగళవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరిధి ఎన్టీపీసీ శ్రీనగర్ కాలనీకి చెందిన ఈ ఇద్దరిని ఏటీఎస్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరిలో తండ్రీ జావేద్, కూతురు ఖదీజా ఉన్నారు. వీరు హైదరాబాద్‌ టోలీచౌకిలో నివాసం ఉంటారు.బక్రీద్‌ వేడుకల కోసం ఎన్‌టీపీసీలోని తమ బంధువుల ఇంటికి వెళ్లడంతో ఏటీఎస్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించింది.