Page Loader
హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు
హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు

వ్రాసిన వారు Stalin
May 11, 2023
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి సంచలనం సృష్టించగా, భోపాల్ ఏటీఎస్, హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం అరెస్టు చేసిన ఐదుగురిని ఏటీఎస్ అధికారులు బుధవారం భోపాల్ కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీ విధించింది. పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్న శివాజీ నగర్, జవహర్ నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసులు బుధవారం అరెస్టు చేశాయి. ఉగ్రవాద కుట్ర కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సహా మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. వీరందరికీ హిజ్బుత్ తహ్రీక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్

భోపాల్ ఏటీఎస్, హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త విచారణలో ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నారని తేలింది. మధ్యప్రదేశ్, హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాకుండా భారీగా మత మార్పిళ్లను ప్రోత్సహించి యువతను హిజ్బుత్ తహ్రీక్ ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించేందుకు ఈ గ్యాంగ్ పని చేస్తున్ననట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దేశంలో భారీ విధ్వంసానికి పథక రచన చేసినట్లు గుర్తించారు. దేశంలో ఇంకా ఈ ముఠాలో ఎంతమంది సభ్యలు ఉన్నారనే దానిపై అరెస్టయిన వారి నుంచి భోపాల్ ఏటీఎస్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.