
Gun Firing: ఈశాన్య ఢిల్లీ వెల్‌కమ్ ఏరియాలో 2 గ్రూపుల మధ్య కాల్పులు.. ఒక మహిళకు గాయలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో భారీ కాల్పులు జరిగాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 60 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు సమాచారం అందుతోంది.
ఈ కాల్పుల్లో ఓ మహిళ గాయపడింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. దీని ద్వారా కాల్పులకు పాల్పడిన వ్యక్తులను గుర్తించవచ్చని వారు తెలిపారు.
శనివారం సాయంత్రం రాజా మార్కెట్‌లో ఘర్షణ,కాల్పులు జరిగాయని ఈశాన్య ఢిల్లీ డీసీపీ రాకేశ్ పవారియా తెలిపారు.
వివరాలు
జీన్స్ హోల్‌సేల్ వ్యాపారుల మధ్య గొడవ
వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సద్దుమణిగించారు.సంఘటన స్థలంలో చాలా ఖాళీ కాట్రిడ్జ్‌లు కనుగొనబడ్డాయి.
స్థానికులు,ఈ గొడవను చూస్తున్న ఓ మహిళపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.
ఆమెను జిటిబి ఆసుపత్రికి తరలించారు.ఈ ఘర్షణ జీన్స్ హోల్‌సేల్ వ్యాపారుల మధ్య డబ్బు విషయంలో జరిగిన గొడవల నేపథ్యంలో చోటు చేసుకుంది.
రాజా మార్కెట్‌లో జీన్స్ వ్యాపారుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.
శనివారం జరిగిన ఘర్షణలో ఇరువర్గాల నుంచి సుమారు 60 రౌండ్లు కాల్పులు జరిగాయని తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఘటనా స్థలాన్ని క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెండు వర్గాల మధ్య ఘర్షణ..
गोलियों की तड़तड़ाहट से एक बार फिर दहली दिल्ली
— Sagar Malik (Journalist) (@sagarmalik1985) October 19, 2024
नॉर्थ ईस्ट दिल्ली वेलकम इलाके में 2 गुटों में ताबड़तोड़ फायरिंग
एक लड़की के सीने में लगी गोली
स्थानीय लोगों के मुताबिक 60 राउंड से ज्यादा फायरिंग हुई।
दिल्ली पुलिस के आला अधिकारी और क्राइम टीम मौक़े पर मौजूद।#Welcome #Delhi pic.twitter.com/S1bRIWBoge