Meerut: మీరట్‌లో ఉద్రిక్తత.. పోలీసులకు,గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీసులకు, గోవుల అక్రమ రవాణాదారులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మీరట్‌లో కొందరు వ్యక్తులు గోవులను అక్రమంగా తరలించడంతో పాటు గోవధకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ గోవును చెట్టుకు కట్టేసి ఉంచినట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకున్న విషయాన్ని గమనించిన తస్లీమ్, భూరా అనే ఇద్దరు స్మగ్లర్లు వెంటనే కాల్పులు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
వివరాలు
తస్లీమ్‌పై ఇప్పటికే 15 కేసులు
దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తస్లీమ్, భూరా ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటన సమయంలో మరో స్మగ్లర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
కాగా.. తస్లీమ్‌పై ఇప్పటికే 15 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
భూరాపై కూడా 10 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పోలీసులపై కాల్పులు జరిపిన ఇద్దరు స్మగ్లర్లు
मेरठ: सरूरपुर थाना क्षेत्र में गौकशी की कोशिश कर रहे बदमाशों से पुलिस की मुठभेड़।
— Gaurav Trivedi (@gaurav3vedi) August 24, 2026
जवाबी कार्रवाई में दो आरोपी तसलीम और भूरा पैर में गोली लगने से घायल, गिरफ्तार।
मौके से 2 अवैध तमंचे, खोखा कारतूस, गौकशी के उपकरण, रस्सी से बंधा जीवित गोवंश और बिना नंबर की स्प्लेंडर बाइक बरामद।… pic.twitter.com/hDNcuaPl8u