తదుపరి వార్తా కథనం
Manohar Naidu: గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 15, 2025
05:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే తన రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపిస్తానని ఆయన మీడియాకు వెల్లడించారు.
కూటమి నేతల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
మేయర్ పదవికే రాజీనామా చేస్తున్నానే తప్పా, ప్రజల పక్షంలో నిలబడే విషయంలో మాత్రం వెనకడుగు వేయనని మనోహర్ నాయుడు స్పష్టం చేశారు.
అయితే, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతానని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.