NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లతో భయాలు వద్దు: ఐసీఎంఆర్
    తదుపరి వార్తా కథనం
    హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లతో భయాలు వద్దు: ఐసీఎంఆర్
    హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లతో భయాలు వద్దు: ఐసీఎంఆర్

    హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లతో భయాలు వద్దు: ఐసీఎంఆర్

    వ్రాసిన వారు Stalin
    Mar 14, 2023
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హెచ్3ఎన్2, టైప్ బీ ఇన్‌ప్లూయెంజా, అడెనో, కరోనా లాంటి గాలి ద్వారా సంక్రమించే వైరస్‌లు ఆందోళనకరమైనవి కావని నేషనల్ ఇన్‌ప్లూయెంజా సెంటర్ (ఎన్ఐసీ) పేర్కొంది.

    ఎన్ఐసీ అనేది పుణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)లో ఒక భాగం. అలాగే వైరాలజీ పరిశోధనా సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నడుస్తుంది.

    గత రెండు, మూడు నెలలుగా దేశవ్యాప్తంగా రకరకాల ఫ్లూలతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొందరికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఇదే సమయంలో ఫ్లూల కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒకరు చొప్పున మరణించారు.

    వైరస్

    మాస్కులను ధరించి, సామాజిక దూరం పాటించాలి: ఎన్ఐసీ చీఫ్ వర్షా పోత్దార్

    హెచ్3ఎన్2, టైప్ బీ ఇన్‌ప్లూయెంజా, అడెనో వైరస్‌లు సీజనల్‌గా వ్యాప్తి చెందుతాయని ఎన్ఐసీ చీఫ్ వర్షా పోత్దార్ చెప్పారు. ఒక సీజన్‌లో ఒక వైరస్‌తో మరొక వైరస్ సర్క్యులేట్ అవుతుందని చెప్పారు.

    ఆగస్టు నుంచి అక్టోబరు వరకు హెచ్1ఎన్1 ప్రధానంగా ఉందని, నవంబర్ నుంచి హెచ్3ఎన్2 ఆధిపత్యం ప్రారంభమైందని వర్షా పేర్కొన్నారు. ఇప్పుడు హెచ్3ఎన్2తోపాటు టైప్ బి వైరస్ కూడా వ్యాపిస్తోందని వెల్లడించారు. ప్రపంచ‌వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని చెప్పారు.

    పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వర్ష వెల్లండించారు.

    చేతులను శుభ్రంగా కడుక్కోవడం, కరోనా నియమాలను పాటించడం, మాస్కులను ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025