దేశంలో హెచ్2ఎన్3 వైరస్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; రాష్ట్రాలకు లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో హెచ్2ఎన్3, హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరుపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
చేతులను శుభ్రంగా కడుక్కోవడం, లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం, దగ్గు, జలుపు, ఇతర శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న వారు జనాల్లోకి రాకుండా చూసుకోవడం, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని లేఖలో భూషణ్ పేర్కొన్నారు.
చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని హెచ్1ఎన్1, హెచ్3ఎన్2, అడెనో వైరస్‌ల బారిన పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
కేంద్రం
కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయ్: కేంద్రం
కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివిటీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయని రాజేష్ భూషణ్ వెల్లడించారు. కరోనా కేసులపై తక్షణమే దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించారు. తక్కువ సంఖ్యలో ఆసుపత్రిలో చేరడం, గణనీయంగా టీకా పంపిణీ జరిగినప్పుటికీ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.
హెచ్2ఎన్3, హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల వ్యాప్తిని పరిమితం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఔషధాలు, వైద్య పరికరాలు, ఆక్సిజన్, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ చర్చలు కరోనాను, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల కట్టడికి తోడ్పడుతాయని చెప్పారు.
వైరస్‌ల వ్యాప్తిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, అవసరమైన సాయాన్ని అందజేస్తామని భూషణ్ తెలిపారు.