హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా రూపంలో మరో వైరస్ వణికిస్తోంది. దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా కర్ణాటక, హర్యానాలో హెచ్‌ఎన్‌వైరస్‌సోకి ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దేశంలో ఇప్పటికే హెచ్‌ఎన్ వైరస్ కేసులు 90నమోదయ్యాయి. హెచ్1ఎన్1 కేసులు 8 నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కూడా కరోనా మాదిరిగానే వ్యాపిస్తుందని హెచ్చరించింది. వైరస్ మరణాలు నేపథ్యంలో కర్ణాటక, హర్యానాలో ప్రభుత్వాలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తమిళనాడులో సామూహిక జ్వర శిబిరాలను ఏర్పాటు చేశారు. సుమారు 1000 ఫీవర్ క్యాంపులు ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ ప్రకటించారు.
హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు ఏంటి? ఎప్పుడు గుర్తించారు?
హెచ్3ఎన్2 వైరస్‌ను మనిషిలో మొదటిసారిగా జూలై 2011లో గుర్తించారు. అంతకుముందు 2010లో ఇది పందుల్లో కనిపించింది. దీనినే 'హాంకాంగ్ ఫ్లూ' అని కూడా అంటారు. 2012లో తొలిసారిగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ వైరస్ బారిన పడ్డారు. అప్పుడు 309 మందికి వైరస్ సోకగా, వారిలో 16 మంది ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఒకరు మరణించారు. హెచ్3ఎన్2తో బాధపడుతున్న రోగుల్లో గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యలు చెబుతున్నారు. ఈ వైరస్ వేగంగా పరివర్తన చెందిందని, దీని కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిందని అంటున్నారు. హెచ్3ఎన్2 వైరస్ అనేది ప్రతి సంవత్సరం కొద్దిగా రూపాంతరం చెందుతూ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.