Page Loader
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2023
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర పోరు 13 రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతుండగా, హమాస్ సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ అధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 5000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క గాజాలోనే 1524 మంది చిన్నారులతో సహా 3700 మంది మృత్యువాత పడ్డారు. ఈ యుద్ధంపై ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో పౌరుల మరణాల పట్ల మోదీ సంతాపం ప్రకటించారు.

Details

పాలస్తీనాలో నెలకొన్న హింసపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ

పాలస్తీనా ప్రజలు కోసం భారత్ మనవతా సహాయాన్ని కొనసాగిస్తుందని మోదీ చెప్పారు. పాలస్తీనాలో నెలకొన్న తీవ్రవాదం, హింసపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా, ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌లో పర్యటించి, హమాస్ దాడులను ఖండించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ పాలస్తీనా అధ్యక్షుడికి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ లో స్పందించిన మోదీ