తదుపరి వార్తా కథనం

Fire Accident: నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు దగ్ధం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 30, 2024
08:52 am
ఈ వార్తాకథనం ఏంటి
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యాసంస్థల బస్సు దగ్ధమైంది.
గుంటూరులో నర్సింగ్ విద్యార్థులకు పరీక్షల కోసం బయలుదేరిన బస్సు, విద్యుదాఘాతంతో మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది.
అయితే ముందుగానే పొగను గుర్తించిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో విద్యార్థులు వెంటనే బస్సు నుంచి బయటకు దిగారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.
స్థానికులు స్పందించి మంటలను ఆర్పేందుకు నీళ్లు చల్లారు.
Details
సురక్షితంగా బయటపడ్డ విద్యార్థులు
సమాచారం అందుకున్న రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బస్సుల నిర్వహణ, భద్రతాపరమైన చర్యలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.