తదుపరి వార్తా కథనం
Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం.. తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 28, 2025
08:14 am
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. సత్యనారాయణ మరణ వార్తతో హరీశ్‌రావు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అలాగే ఇతర రాజకీయ నాయకులు అక్కడికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. హరీశ్‌రావు,ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాజీ మంత్రి హరీశ్‌రావుకు పితృవియోగం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావుకు పితృవియోగం..#harishrao #brs #tv9telugu pic.twitter.com/0YBm74Ccbm
— TV9 Telugu (@TV9Telugu) October 28, 2025