Page Loader
రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 
రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 

వ్రాసిన వారు Stalin
Aug 02, 2023
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన వాదాస్పదమైంది. పోలీసులు అందరికీ రక్షణ కల్పించలేరని సీఎం ఖట్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభా 2.7 కోట్లు ఉంటే, ప్రభుత్వం దగ్గర 60 వేల మంది పోలీసులు మాత్రమే ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అందరికీ రక్షణ కల్పించలేరని పేర్కొన్నారు. నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలపై బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం ఈ వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు మరణించారని తెలిపారు. ఈ కేసుల్లో 116 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

హర్యానా

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం

రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. మత ఘర్షణల్లో గాయపడిన క్షతగాత్రులను నుహ్‌లోని నల్హర్, గురుగ్రామ్‌లోని మేదాంత సహా పలు ఆసుపత్రుల్లో చేర్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే మిగతా నిందితులను కూడా గుర్తిస్తున్నామని వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యుల భద్రత ప్రభుత్వం బాధ్యత అని సీఎం ఖట్టర్ స్పష్టం చేశారు. నుహ్‌లో జరిగిన హింస బాధాకరమని, శాంతి, కాపాడాలని ప్రజలకు ముఖ్యమంత్రి ఖట్టర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హర్యానా పోలీసు సిబ్బందితో పాటు 20 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలను మోహరించినట్లు సీఎం వెల్లడించారు.