Page Loader
ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ
56వ సారి బదిలీ అయిన హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా

ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ

వ్రాసిన వారు Stalin
Jan 10, 2023
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయి జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచారు. ఎక్కువ సార్లు బదిలీ అయిన అధికారిగా అశోక్ ఖేమ్కాకు పేరుంది. తన 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇది అతనికి 56వ ట్రాన్స్‌ఫర్. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ చీఫ్ సెక్రటరీ అయిన ఖేమ్కాను ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఖేమ్కా బదిలీకి ప్రభుత్వం నిర్దిష్ట కారణాలేవీ చెప్పకపోవడం గమనార్హం.

అశోక్

బదిలీ ఆ లేఖే కారణమా?

అశోక్ ఖేమ్కా తాజా బదిలీకి ఆయన రాసిన లేఖ అని ప్రచారం జరుగుతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు బదలీ అయిన కొన్నిరోజలు తర్వాత హర్యానా చీఫ్ సెక్రటరీ సర్వేష్ కౌశల్‌కు అశోక్ ఖేమ్కా ఓ లేఖ రాశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఉన్నత విద్యా శాఖలో విలీనం చేసిన తర్వాత తనకు తగినంత పని లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తన స్థాయికి తగినట్లు, వారానికి 40రోజులు పని చేసే డిపార్ట్‌మెంట్‌ కేటాయించాలని కోరారు. ఈ క్రమంలో ఆయనను బదలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వంలో ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్ శాఖకు ఖేమ్కా బదిలీ కావడం ఇది మూడోసారి. గతంలో ఆర్కైవ్స్ శాఖ డైరెక్టర్ జనరల్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.