Page Loader
హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క 
హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క

హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క 

వ్రాసిన వారు Stalin
Apr 14, 2023
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని కర్నాల్‌లో దారుణం జరిగింది. పిట్‌బుల్ కుక్క 30 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి అతని పురుషాంగాన్ని కొరికేసింది. బాధితుడిని బిజ్నా గ్రామానికి చెందిన కరణ్ శర్మ (30)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఘరౌండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘరౌండ ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన చికిత్స, ఇంజెక్షన్ అందుబాటులో లేనందున కరణ్ శర్మను కర్నాల్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు అతని సోదరుడు తెలిపాడు.

కుక్క

పొలానికి వెళుతుండగా దాడి చేసిన కుక్క

కరణ్ శర్మ పొలానికి వెళుతుండగా దారితప్పిన పిట్‌బుల్ దాడి చేసినట్లు అతని సోదరుడు చెప్పాడు. కుక్కను వదిలించుకునే ప్రయత్నంలో అతను దానిని కర్రతో కొట్టాడని, ఆ తర్వాత కుక్క అతని ప్రైవేట్ భాగాన్ని కరిచిందని వెల్లడించారు. అనంతరం గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కరణ్‌ను రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కుక్క యజమాని ఎవరో తెలియకపోవడంతో ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.