LOADING...
Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిలో మరో డాక్టర్ అరెస్ట్.. డాక్టర్ ప్రియాంకా శర్మను అదుపులోకి తీసుకున్న అధికారులు..
డాక్టర్ ప్రియాంకా శర్మను అదుపులోకి తీసుకున్న అధికారులు..

Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిలో మరో డాక్టర్ అరెస్ట్.. డాక్టర్ ప్రియాంకా శర్మను అదుపులోకి తీసుకున్న అధికారులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎర్రకోట కార్ పేలుడు కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజా విచారణలో అధికారులు 'వైట్ కాలర్' మాడ్యూల్‌కు అనుబంధంగా ఉన్న మరో మహిళా వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్‌లు అనంత్‌నాగ్‌లోని మలక్‌నాగ్ ప్రాంతంలోని ఒక హాస్టల్‌పై దాడులు జరిపి, హర్యానా రోహ్‌తక్‌కు చెందిన డాక్టర్ ప్రియాంకా శర్మను అరెస్ట్ చేశాయి. ఆమె అనంత్‌నాగ్ జీఎంసీలో పనిచేస్తున్నట్లు సమాచారం. దాడుల్లో ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు ఉగ్ర మాడ్యూల్‌కు ఆర్థిక, లాజిస్టిక్ సహకారం అందించిన ఆరోపణలపై జీఎంసీ అనంత్‌నాగ్ మాజీ ఉద్యోగి అదీల్‌ను అరెస్ట్ చేసిన తర్వాత, ప్రియాంకా శర్మ పేరు బయటపడ్డట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

 200 మంది కాశ్మీర్ వైద్యులపై నిఘా 

ఈ కేసు నేపథ్యంలో ఎన్ఐఏతో పాటు పలు ఏజెన్సీలు దాదాపు 200 మంది కాశ్మీర్ వైద్యులపై నిఘా పెట్టాయి. కాన్పూర్, లక్నో, మీరట్, సహరాన్‌పూర్ తదితర ప్రాంతాల్లో చదువుతున్న కాశ్మీరీ విద్యార్థులు ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలను కూడా ఎన్ఐఏ పరిశీలిస్తోంది. గత సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర పేలుడు పదార్థాలతో నిండిన కారులో డాక్టర్ ఉమర్ ఆత్మాహుతికి పాల్పడిన ఘటన పెద్ద కలకలం రేపింది. ఈ దాడికి ముందే ఇలాంటి కుట్రల్లో పాల్గొన్న పలువురు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరందరికీ హర్యానా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్టు విచారణలో బయటపడింది. ఇదే నేపథ్యంలో వర్సిటీకి అనుబంధంగా ఉన్న మరికొంతమందిని నుహ్, ధౌజ్ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.