Loading...
Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమయ్యాయా..? మొబైల్‌తో ఇలా చెక్ చేయండి!
రైతు భరోసా డబ్బులు జమయ్యాయా..? మొబైల్‌తో ఇలా చెక్ చేయండి!

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమయ్యాయా..? మొబైల్‌తో ఇలా చెక్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రైతులకు భారీ శుభవార్త లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నగదును ఆదివారం విడుదల చేయనుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించే బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొననున్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.3,590కోట్లను విడుదల చేస్తోంది. రైతు భరోసా లబ్ధిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6,000చొప్పున జమ చేయనున్నారు.

Details

స్టేటస్ చెక్ ఇలా..

రైతులు తమకు డబ్బులు జమ అయ్యాయా లేదా అనే విషయాన్ని ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్ [https://www.rythubharosa.telangana.gov.in/](https://www.rythubharosa.telangana.gov.in/) ను ఓపెన్ చేయాలి

హోమ్‌పేజీలో కుడివైపు ఉన్న 'లాగిన్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి

'లాగిన్ విత్ మొబైల్ నెంబర్' ఎంపిక చేసి, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి

ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి

'పేమెంట్ స్టేటస్'పై క్లిక్ చేయాలి

ఆధార్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి * అనంతరం స్క్రీన్‌పై మీకు నగదు జమ అయ్యిందా లేదా అనే వివరాలు కనిపిస్తాయి

Details

సోమవారం ఖాతాల్లోకి నగదు

ఆదివారం నిధులు విడుదల చేసినప్పటికీ, బ్యాంకులకు సెలవు దినం కావడంతో రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము సోమవారం జమ కానుంది.

ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా బ్యాంకులకు నిధులు బదిలీ అవుతాయి. అనంతరం బ్యాంకులు రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి.

మరో రెండు విడతలు కూడా

రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడతగా 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నారు.

రాష్ట్రంలో 24.32 లక్షల మంది రైతులు ఒక ఎకరం వరకు భూమి కలిగి ఉండగా, 48.68 లక్షల మంది రైతులు ఒక ఎకరం కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నారు.

ADVERTISEMENT

Details

ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభం

ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

ఈ కర్మాగారం ద్వారా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది.

ఉత్తర, దక్షిణ తెలంగాణలోని మొత్తం 18 జిల్లాల రైతులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

ADVERTISEMENT