Page Loader
Ram temple: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన అయోధ్య రామాలయ ప్రధాన పూజారి
బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన అయోధ్య రామాలయ ప్రధాన పూజారి

Ram temple: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన అయోధ్య రామాలయ ప్రధాన పూజారి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో లఖ్‌నవూలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. మధుమేహం, బీపీ సమస్యలతో బాధపడుతున్న సత్యేంద్ర దాస్‌ ఆదివారం ఆస్పత్రిలో చేరారని వైద్య వర్గాలు తెలిపాయి. బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, అయితే అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు.

Details

 రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్న సత్యేంద్ర దాస్

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష స్వీకరించారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వంటి కీలక కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషించారు. ప్రస్తుతం అయోధ్య రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.