Student Suicide: దిల్లీ ఓ టీచర్ల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య.. హెడ్‌మాస్టర్ సహా ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక ఒక విద్యార్థి ఆత్మహత్యకు (Student Suicide) పాల్పడిన ఘటనలో తాజా పరిణామాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించి స్కూల్ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకుంటూ, హెడ్‌మాస్టర్‌తో పాటు ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ (Suspend) చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చింది. దిల్లీలోని సెయింట్ కొలంబా స్కూల్ (St Columba's School)లో పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల శౌర్య పాటిల్ ఈ నెల 18న మెట్రో స్టేషన్ పై నుండి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తన సూసైడ్ నోట్‌లో ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అవమానాలు,వేధింపుల కారణంగానే జీవితాన్ని ముగించుకుంటున్నానని, బాధ్యులపై చర్యలు తీసుకోాలని స్పష్టంగా రాశాడు.
వివరాలు
విద్యార్థి తండ్రి ప్రదీప్ పాటిల్ పోలీసులకు ఫిర్యాదు
"అమ్మా, నన్ను క్షమించు... ఈ నిర్ణయం స్కూల్ సిబ్బంది వేధింపుల వల్లే తీసుకుంటున్నా. నా మరణం తర్వాత నా అవయవాలు ఉపయోగపడితే అవసరమున్న వారికి దానం చేయండి. అమ్మా... నీ హృదయాన్ని ఎన్నోసార్లు నొప్పించా, ఇప్పుడు చివరిసారిగా చేస్తున్నా" అని తన నోట్‌లో పేర్కొన్నాడు. ఈ సంఘటనతో కుమారుడి మరణానికి బాధ్యులని భావిస్తూ విద్యార్థి తండ్రి ప్రదీప్ పాటిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లాస్ 5 నుంచి 10వరకు అకడమిక్ బాధ్యతలు చూసే హెడ్‌మాస్టర్ అపరాజిత పాల్, అలాగే ఉపాధ్యాయులు జూలీ వర్గీస్, మను కల్రా, యుక్తి అగర్వాల్ మహాజన్ విద్యార్థిని వేధించారని పేర్కొనడంతో, పోలీసు అధికారులు వారి పేర్లతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
వివరాలు
విద్యార్థులు, సిబ్బంది, పేరెంట్స్‌తో మాట్లాడద్దు
ఈ ఆరోపణల నేపథ్యంలో హెడ్‌మాస్టర్‌తో పాటు సంబంధిత ముగ్గురు ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ ప్రకటించారు. విచారణకు అందుబాటులో ఉండాలని, విచారణ ముగిసే వరకు స్కూల్‌కు రావడం కానీ, విద్యార్థులు, సిబ్బంది, పేరెంట్స్‌తో మాట్లాడటం కానీ చేయవద్దని స్పష్టం చేశారు.