Page Loader
వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా
వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా

వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా

వ్రాసిన వారు Stalin
Apr 28, 2023
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఇప్పుడు వాదనలు వినలేమని శుక్రవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డి తరపు లాయర్ వాదనలు విన్న ధర్మాసనం సెలవుల కారణంగా కేసు విచారణను జూన్ 5కి వాయిదా వేసింది. తన క్లయింట్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని, వేసవి సెలవుల కోర్టులో పిటిషన్‌ను విచారించాలని అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.

వైెఎస్ వివేక

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము: హైకోర్టు

రెండు వారాల పాటు కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో విచారణకు అనుమతించాలని అవినాష్ తరపు న్యాయవాది హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను కోరారు. దీనికి సీజేఐ సెలవు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ సూచించారు.