Supreme Court: కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 13వ తేదీకి వాయిదా పడింది. మద్యం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. సమన్లకు సంబంధించి తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తన పిటిషన్‌లో కోరారు. అలాగే మహిళలను ఇంట్లోనే విచారించాలన్న అంశాన్ని కూడా కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బుధవారం కేసును క్షుణ్ణంగా పరిశీలించేందుకు సమయం సరిపోదని పేర్కొంటూ సుప్రీంకోర్టు విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసింది. మార్చి 13న ఇరు పక్షాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు వెల్లడించారు.