Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. విచారణ రేపటికి వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది.
కానీ ధర్మాసనం మరో కేసుతో బిజీగా ఉండటంతో, ఇవాళ జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది.
శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఈ కేసును విచారణకు తీసుకోవాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగింది అనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలా అనే విషయంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.
ఈ విషయంపై ఏ నిర్ణయమో గురువారం చెప్పాలని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది.
వివరాలు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ
కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ వివాదంపై, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరగాలని కోరుతూ, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, భక్తుడు విక్రమ్ సంపత్, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టి, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.