Andhra Pradesh: ఏపీలో మండుతున్న ఎండలు.. 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదివారం మార్కాపురం జిల్లాలోని కంభంలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలో ఉన్న 65 మండలాల్లో 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇక, సోమవారం కూడా రాష్ట్రంలో ఎండలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని సూచించారు.