తదుపరి వార్తా కథనం

SRSP: ఎస్సారెస్పీలోకి భారీగా వరద ప్రవాహం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 18, 2025
11:35 am
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాల కారణంగా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌రావు గుప్తా సమాచారం ప్రకారం,ప్రస్తుతం సెకనుకు 1,51,932 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు కాగా,ఈ సమయంలో 1088.70అడుగులకు చేరింది. అలాగే,మొత్తం నిల్వ సామర్థ్యం 80.80టీఎంసీలు ఉండగా,ప్రస్తుతానికి 72.61టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం 10గంటలకు ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వరద నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈ వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే,మత్స్యకారులు చేపల వేట కోసం నదిలోకి వెళ్లరాదని,పశువుల కాపరులు కూడా నది ప్రాంతానికి వెళ్లకూడదని ఆయన హెచ్చరించారు.