Loading...
Srisailam: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. జూరాల నుంచి 79 వేల క్యూసెక్కులు
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. జూరాల నుంచి 79 వేల క్యూసెక్కులు

Srisailam: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. జూరాల నుంచి 79 వేల క్యూసెక్కులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిరంతరంగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి గురువారం ఉదయం నాటికి 79,403 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి జలాశయంలో నీటిమట్టం 824.80 అడుగులుగా నమోదుకాగా, నీటి నిల్వ 44.6090 టీఎంసీలకు చేరింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించలేదు.

వివరాలు 

జూరాలలో పెరుగుతున్న వరద ప్రవాహం

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జూరాల జలాశయం కళకళలాడుతోంది.

కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి గత మూడు రోజులుగా కృష్ణా నదిలో దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వచ్చే ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.

గురువారం ఉదయం జూరాల ఇన్‌ఫ్లో సుమారు 80 వేల క్యూసెక్కులుగా నమోదైంది.

ప్రస్తుతం జూరాల జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా, దాని ద్వారా 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు 10 గేట్లను ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు.

ADVERTISEMENT