తదుపరి వార్తా కథనం
Singuru Project: సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. పరీవాహక ప్రజలకు హెచ్చరికలు జారీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 19, 2024
02:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్ ఫ్టో 567 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 393 క్యూసెక్కులుగా ఉంది.
ఇక సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.9 టీఎఎంసీలు నీరు చేరింది. ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి ఏ క్షణంలోనే పెరిగే అవకాశం అధికారులు తెలిపారు.
మంజీరా నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.