LOADING...
Manjeera Barrage: 25 ఏళ్ల తర్వాత మంజీర బ్యారేజీకి భారీగా వరద నీరు
25 ఏళ్ల తర్వాత మంజీర బ్యారేజీకి భారీగా వరద నీరు

Manjeera Barrage: 25 ఏళ్ల తర్వాత మంజీర బ్యారేజీకి భారీగా వరద నీరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని మంజీరా బ్యారేజ్‌కి ఇరవై ఐదేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద వచ్చిందని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు (HMWB) ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై ఆయన సంగారెడ్డిలో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై నిరంతరం సమీక్ష చేస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Details

నీట మునిగిన మంజీరా బ్యారేజ్ ఫిల్టర్ బెడ్

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు కూడా భారీ వరద వచ్చిందని అశోక్ రెడ్డి తెలిపారు. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో వాటికి వచ్చే ఇన్‌ఫ్లో తగ్గింది. ముఖ్యంగా, సంగారెడ్డి ప్రాంతంలోని 'మంజీరా బ్యారేజ్ ఫిల్టర్ బెడ్' నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. రెండు రోజుల్లో మంజీరా ఫిల్టర్ బెడ్‌ను బాగుచేస్తామని ఆయన స్పష్టం చేశారు.