LOADING...
Hyderabad Rains: హైదరాబాద్'లో దంచికొడుతున్న వాన.. 
హైదరాబాద్'లో దంచికొడుతున్న వాన..

Hyderabad Rains: హైదరాబాద్'లో దంచికొడుతున్న వాన.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఎస్సార్ నగర్,పంజాగుట్ట,బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఫిలిమ్ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షం ధారలుగా పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి.రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వచ్చే రెండు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా వెల్లడించింది.

వివరాలు 

నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి:అధికారులు

ఉత్తరం, పశ్చిమం, మధ్యహైదరాబాద్‌లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, షేక్‌పేట్, ఖైరతాబాద్, టోలీచౌకీ, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ సూచించింది. ఆ తరువాత మెహదీపట్నం, చార్మినార్, నాంపల్లి వైపుకు దక్షిణ హైదరాబాద్‌లో కూడా వర్షం విస్తరిస్తుందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో, నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని, లేకపోతే ఇంట్లోనే ఉండటమే మంచిదని సూచించారు.