LOADING...
Hyderabad: హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం
హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం

Hyderabad: హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2025
07:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాలు ఆదివారం సాయంత్రం కుండపోత వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు నిల్వ కావడంతో రాకపోకలు మందగించాయి. ఇక రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. ఈ వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

వివరాలు 

దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండం

అదే సమయంలో, ఈనెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో, దాని పక్కన ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం డైరెక్టర్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ అల్పపీడనం 26వ తేదీకి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడవచ్చని తెలిపారు. అలాగే 27వ తేదీ నాటికి అదే ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశముందని వివరించారు.