Andhra Pradesh : రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 18, 2026
05:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాబోయే మూడు గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని సూచించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండి ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఇక గన్నవరం విమానాశ్రయంలో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. దిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ కారణంగా గన్నవరం విమానాశ్రయంలో దిగలేకపోయింది.