LOADING...
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్

Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 26 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని IMD ఒక ప్రకటనలో తెలిపింది. దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది.

Details

భారీ వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. గాలులు ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచవచ్చు. ఆగస్టు 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కొనసాగుతాయి.

Details

రెడ్ అలర్ట్ జిల్లా సూచనలు

ఈ ప్రభావం కారణంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలు మరియు యానాం ప్రాంతాలకు మంగళవారం మధ్యాహ్నం నుంచి 'రెడ్ అలర్ట్' జారీ చేయబడింది. రెడ్ అలర్ట్ అంటే 24 గంటల్లో 20 సెంటీమీటర్లకంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని అర్థం. అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.