బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం
బిపోర్‌జాయ్ తుపాను తీరం దాటే సమయంలో దిల్లీలో కూడా వర్షాలు కురిశాయి. గాలులు చాలా బలంగా వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దిల్లీలో కురిసిన వర్షానికి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. నీటితో నిండిన ఫ్లైఓవర్ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిల్లీ శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ దిల్లీలోని వసంత్‌కుంజ్, మాల్వియానగర్, కల్కాజీ, తుగ్లకాబాద్, ఛత్తర్‌పూర్, ఇగ్నో, దేరమాండి, ఎన్‌సీఆర్‌లోని పరిసర ప్రాంతాల్లో గంటకు 30-40 కిమీ వేగంతో గాలులు వీస్తూ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.