
Heavy rains: తెలంగాణకు భారీ వర్షాల సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ములుగు, హనకొండ, వరంగల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
Details
కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఈ వర్షాలు కురుస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా కురవచ్చని వివరించారు.