Page Loader
AP Rains: ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాల సూచన.. వాతావరణ శాఖ!
ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాల సూచన.. వాతావరణ శాఖ!

AP Rains: ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాల సూచన.. వాతావరణ శాఖ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చి దేశంలోని పలు ప్రాంతాలను తాకడంతో అనేక చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో భారీ వానలు దంచికొట్టాయి. అయితే కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో అన్నదాతలు వానకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది రైతులు కప్పతల్లి ఆటలు ఆడుతూ వరుణ దేవుడిని కరుణించమని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ శాఖ శుభవార్తను అందించింది.

Details

భారీ వర్షాలు కురిసే అవకాశం

రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని కూడా వెల్లడించారు. తదుపరి రెండు రోజుల్లో భారీ వర్షాల అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రాకూడదని, సురక్షిత ప్రదేశాలలోనే ఉండాలని హెచ్చరించింది.