
TG Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచన.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Details
పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
వాతావరణ శాఖ బుధవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాన్ని పేర్కొంది. యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో చాలా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.