రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
రానున్న ఐదు రోజుల్లో తూర్పు, ఈశాన్యం, తూర్పు మధ్య భారతదేశంలో కుంభవృష్టి కురవనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి. దీని ప్రభావంతో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జనజీవనం స్తంభించడంతో జనం అవస్థలు పడుతున్నారు. నదుల ఉద్ధృత ప్రవాహం, వరదలతో మంచినీటి సరఫరాకు ఆటంకం కలుగుతోంది.మరోవైపు రోడ్ల మీద ట్రాఫిక్ ఇక్కట్లు, విద్యుత్ సరఫరాలో ఆటంకాలు తప్పట్లేదు.
జాతీయ రాజధాని దిల్లీలో సాథారణ స్థాయికి చేరుకున్న ఎయిర్ క్వాలిటీ
ఈశాన్యంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాదిలోని హర్యానా చండీగఢ్ దిల్లీ, ఉత్తరాఖండ్, మధ్య భారతదేశం మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, తూర్పులోని ఒడిశా, పశ్చిమలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. గత 7 రోజులుగా ఏకథాటి వానలతో ముంబయి మహానగరం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ మేరకు మంగళవారం వరకు గ్రీన్ అలెర్ట్ జారీ అయ్యింది. ఆగస్ట్ 2,3న దిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నట్లు అంచనా. తెలంగాణలోనూ సోమవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలతో దిల్లీ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సాథారణ స్థాయికి వచ్చినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వెల్లడించింది.