Page Loader
Kedarnath:భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ మార్గంలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత‌
భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ మార్గంలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు

Kedarnath:భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ మార్గంలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేదార్‌నాథ్ యాత్రను ఈ రోజు తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్ దారి మధ్యలో ఉన్న మున్‌కతియా వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేదారీశ్వరుడి దర్శనాన్ని తాత్కాలికంగా ఆపేశారు. విరిగిన కొండచరియల శిథిలాలు ఆ మార్గంలోని రోడ్డును పూర్తిగా మూసేశాయి. మున్‌కతియా ప్రాంతంలోని స్లైడింగ్ జోన్ మొత్తం రాళ్లతో కప్పబడిపోయింది. ఈ పరిణామాలతో అధికారులు కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. గౌరీకుండ్ దిశ నుంచి వస్తున్న కొంతమంది యాత్రికులు ఆ కొండచరియల మధ్య చిక్కుకుపోయారు. వారికి ఎస్డీఆర్ఎఫ్ (SDRF) సిబ్బంది సహాయం అందించారు.ప్రమాదానికి లోనుకాకుండా వారిని రక్షించి, సురక్షితంగా సోన్‌ప్రయాగ్‌కు తరలించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత‌