Loading...
Kamiya Jani: విమానంలో భారీ కుదుపులు.. 'ఇదే నా చివరి ప్రయాణం కావొచ్చు': ఇన్‌ఫ్లుయెన్సర్
విమానంలో భారీ కుదుపులు.. 'ఇదే నా చివరి ప్రయాణం కావొచ్చు': ఇన్‌ఫ్లుయెన్సర్

Kamiya Jani: విమానంలో భారీ కుదుపులు.. 'ఇదే నా చివరి ప్రయాణం కావొచ్చు': ఇన్‌ఫ్లుయెన్సర్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా తీవ్ర కుదుపులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక కొద్దిసేపు భయంతో గడిపారు. ఇదే సమయంలో ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కామియా జానీ విమానంలో తన అనుభవాన్ని వీడియోగా చిత్రీకరించారు. ఈ ఘటనపై కామియా జానీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్‌ చేశారు. విమానంలో తాను ఎదుర్కొన్న కుదుపులు చాలా తీవ్రంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ''బహుశా.. ఇదే నా చివరి ప్రయాణం కావొచ్చు'' అంటూ తన ఆందోళనను వ్యక్తం చేశారు.

వివరాలు 

నవీ ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన విమానం 

''నా జీవితంలో ఇంతటి కుదుపులతో కూడిన విమాన ప్రయాణం ఇదే తొలిసారి. ఈ ప్రయాణంలో ఏదైనా జరిగితే నేను ఉండకపోవచ్చు'' అని కామియా జానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాశారు.

భారీ కుదుపుల నేపథ్యంలో విమానం గమ్యస్థానంలోనూ మార్పు చోటుచేసుకున్నట్లు ఆమె తెలిపారు.

ముంబయిలోని టెర్మినల్‌-2లో ల్యాండ్‌ కావాల్సిన విమానం.. నవీ ముంబయి విమానాశ్రయంలో దిగిందని కామియా పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనకు సంబంధించిన విమానం ఏది, దాని నంబర్‌ ఏమిటి అనే వివరాలను కామియా జానీ వెల్లడించలేదు.

తీవ్ర కుదుపుల కారణంగా ప్రయాణికులు భయాందోళనకు గురైన విషయాన్ని మాత్రం ఆమె తన సోషల్‌ మీడియా స్టోరీ ద్వారా వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇన్‌ఫ్లుయెన్సర్‌ సంచలన పోస్ట్

ADVERTISEMENT