Loading...
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురు గల్లంతు
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురు గల్లంతు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురు గల్లంతు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లాలో ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. బద్రీనాథ్‌ నుంచి దెహ్రాదూన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాన్స్‌ భారత్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత వారంతా గల్లంతైనట్లు సమాచారం. జేపీ పవర్‌ హౌస్‌ మార్గంలోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన అధికారులు వెంటనే సహాయక బృందాలను అక్కడికి పంపించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు.

వివరాలు 

ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి

రెస్క్యూ, సహాయక చర్యలు చేపట్టారు. వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

మరోవైపు, జోషిమఠ్‌ సమీపంలోని చాయీ గ్రామం దగ్గర హెలికాప్టర్‌ కూలినట్లు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ ధ్రువీకరించారు.

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే వెంటనే ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం.. పర్వత ప్రాంతంలో కూలిన హెలికాప్టర్

ADVERTISEMENT