LOADING...
Medaram: మేడారం జాతర భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం
మేడారం జాతర భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం

Medaram: మేడారం జాతర భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేడారం జాతర కోలాహలం మెుదలైంది. వనదేవతల దర్శనానికి వచ్చేవారు ఎత్తుబంగారం సమర్పిస్తున్నారు. ఇప్పటికే , భక్తులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పలు ఏర్పాట్లను చేసింది. టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది. అంతేకాక, హెలికాప్టర్ సౌకర్యాల ద్వారా కూడా భక్తులు మేడారం చేరుకోవచ్చు. అదేవిధంగా, మేడారం జాతర ప్రదేశానికి హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ వ్యూ ద్వారా జాతర దృశ్యాలను వీక్షించే అవకాశం కూడా ఉంది.

వివరాలు 

హెలికాప్టర్ సర్వీసులు:

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు జనవరి 22 నుండి జనవరి 31 వరకు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుండి భక్తులు మేడారానికి హెలికాప్టర్‌లో చేరవచ్చు.ఆకాశం నుండి జాతర దృశ్యాలను చూసే వీలుగా హెలి రైడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి మేడారానికి ఒకవైపు లేదా రెండు వైపుల అప్‌డౌన్ టిక్కెట్లు ఒక్కొక్కరికి రూ.35,999 ఖర్చు అవుతాయి. జాతర దృశ్యాలను చూడాలనుకునేవారికి 6-7 నిమిషాల విహంగ వీక్షణ జాయ్ రైడ్‌ కూడా ఉంది.

వివరాలు 

జనవరి 28 నుండి మహాజాతర ప్రారంభం

మేడారం సమీపంలోని పడిగాపూర్ హెలిప్యాడ్ నుండి జాయ్ రైడ్ సౌకర్యం అందించబడుతుంది. ఒక్కొక్కరి టిక్కెట్ ధర రూ.4,800. ఈ ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులు వారం రోజుల ముందే ప్రారంభమై భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్‌లైన్స్ ఈ సర్వీసులను నిర్వహిస్తోంది. జాతర ముగిసే తేదీ జనవరి 31 వరకు భక్తులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. పూర్తి వివరాల కోసం 8530004309, 9676320139 నెంబర్లను సంప్రదించవచ్చు.

Advertisement

వివరాలు 

జాతర తేదీలు:

జనవరి 27: మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనం. అదే రోజు తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి జంపన్న మేడారం గద్దెకు చేరతారు. జనవరి 28: కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, ఏటూరునాగారం మండలంలోని కొండాయి నుంచి గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా నుంచి పగిడిద్దరాజులు గద్దెకు చేరతారు. జనవరి 29: వనదేవత సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి చేరతారు. జనవరి 30: భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లిస్తారు. జనవరి 31: దేవతల వన ప్రవేశం. ఫిబ్రవరి 4: తిరుగువారం పండుగతో మహా జాతర ఉత్సవాలు ముగుస్తాయి.

Advertisement