Page Loader
Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు హై అలర్ట్.. జనవరి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు హై అలర్ట్.. జనవరి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ

Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు హై అలర్ట్.. జనవరి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు నిఘా చర్యలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రయాణికుల వద్ద అన్ని వస్తువులు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. తద్వారా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తీసుకెళ్లకుండా నిషేధించారు. ఇక ఎయిర్ పోర్ట్‌కు సందర్శకుల రాకను అంగీకరించలేదు. అనుమానితులు, అనుమానిత వస్తువులు, వాహనాలు కనిపిస్తే అవి అన్ని పూర్తిగా పరిశీలించనున్నారు. జనవరి 30 వరకు ఎయిర్ పోర్ట్‌కు సందర్శకులు రాకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.