LOADING...
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు ఇక తెరపడనుంది. కేబినెట్‌ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తాజా సమాచారం మేరకు రాబోయే ఆదివారం కేబినెట్‌ విస్తరణ జరగనున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో కొత్తగా ముగ్గురు లేదా నలుగురు నేతలకు మంత్రుల పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో కసరత్తు ఊపందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఆలోచనలు, చర్చలు కొనసాగిస్తున్నారు. ఏయే సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరెవరికే శాఖలు కేటాయించాలి? అన్న అంశాలపై దృష్టి పెట్టారు.

Details

త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం

సామాజిక సమీకరణం, రాజకీయ సమతుల్యత పరిరక్షించేలా జాబితా ఖరారు చేయాలన్నదే ఈ యత్నానికి ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి కీలక సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా మీనాక్షితో ఇప్పటికే చర్చలు ముగించారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో అధికారికంగా మంత్రివర్గ విస్తరణ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.