Page Loader
అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు
ఆరోగ్యశాఖ మంత్రి రజనీకి హైకోర్టు నోటీసు

అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు

వ్రాసిన వారు Stalin
Dec 28, 2022
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కేసులో నోటీసు జారీ చేసింది. మంత్రి విడదల రజనీకి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది. ఎన్టీఆర్‌ జిల్లా చిలుకలూరిపేటలోని మురకపూడిలో అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అసైన్డ్ భూముల్లో తవ్వకాలను ఎలా అనుమతులు ఇస్తారంటూ అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో మంత్రి విడదల రజనీ పేరును కూడా చేర్చారు.

హైకోర్టు

ఎంపీ అవినాష్ బంధవుకు కూడా..

మురకపూడిలో 91 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో గ్రానైట్‌ తవ్వకాలకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేయడంలో వైద్యారోగ్య శాఖ మంత్రి పాత్ర ఉందని రైతులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో విచారించిన హైకోర్టుల మంత్రి రజనీతో పాటు తహసీల్దారు, సీఐ, ఎస్సై తోపాటు ఎంపీ అవినాష్ బంధవైన ప్రతాప్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వీరందరూ సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది.